: వరంగల్ లో వడగళ్ల వాన, అనంతపురంలో భారీ వర్షం


వరంగల్ జిల్లాలో ఈరోజు (సోమవారం) ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వానతో పాటు వడగళ్లు పడ్డాయి. చేర్యాల, మద్దూరు, ఏటూరునాగారంలో మొక్కజొన్న తదితర పంటలకు అకాల వర్షంతో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పంట దెబ్బతినటంతో ఈ వర్షంతో రైతన్నలకు నష్టం జరిగింది.

అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు భారీ వర్షం పడింది. అనంతపురంతో పాటు జిల్లాలో రెండు, మూడు ప్రాంతాల్లో జోరు వాన కురిసినట్లు వార్తలందాయి. ఈదురు గాలులతో కూడిన వర్షంతో 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మహా వృక్షాలు కూకటి వేళ్ళతో బయటకు వచ్చాయి.

  • Loading...

More Telugu News