: సినీ జర్నలిస్టుల కలం నుంచి జాలువారిన కథా సంకలనం ‘అంతర్ముఖం’ ఆవిష్కరణ
41 మంది ఫిల్మ్ జర్నలిస్టులు రాసిన కథలను సేకరించి ‘అంతర్ముఖం’ పేరుతో సంకలనంగా తీసుకొచ్చారు బత్తుల ప్రసాద్. ‘అంతర్ముఖం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో ఈ రోజు (సోమవారం) తెలుగు సినీదర్శకుడు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు చేతుల మీదుగా జరిగింది. ఫిల్మ్ జర్నలిస్టుల్లోని రచయితలను వెలికి తీసే ప్రయత్నం చేశారు బత్తుల. సినీ జర్నలిస్టుల కలం నుంచి వెలువడి, వివిధ పత్రికల్లో ప్రచురితమైన 41 కథలను ఏరి, కథా మాలగా కూర్చి పాఠకులకు అందించారు సంకలనకర్త. పుస్తక ఆవిష్కరణ అనంతరం 41 మంది రచయితలను దర్శక నిర్మాతలైన దాసరి, సి.కల్యాణ్ ఘనంగా సత్కరించారు.