: పీసీసీ చీఫ్ నాకు ఇవ్వండి: దానం
పీసీసీ చీఫ్ పదవి తనకు కేటాయించాలని మాజీ మంత్రి దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన సందర్భంగా ఆయన మనసులోని మాట బయటపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, తన చేతుల్లో పార్టీని పెడితే విజయానికి కృషి చేస్తానని డిగ్గీరాజాకు విన్నవించినట్టు సమాచారం. అయితే దానం విజ్ఞప్తిని సావధానంగా విన్న డిగ్గీరాజా మౌనంగానే నిష్క్రమించినట్టు తెలుస్తోంది.