: తిరుపతి-కాచిగూడకు మూడు కొత్త రైళ్లు


తిరుమల యాత్రికులకు, చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త! ఇకపై తిరుపతి నుంచి ఆదివారం నాడు హైదరాబాదుకు వెళ్లాలనుకునే వారికి మరిన్ని రైల్వే టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు, వారంలో రెండు రోజుల పాటు మూడు కొత్త రైళ్లు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మీదుగా హైదరాబాదులోని కాచిగూడ స్టేషన్ వరకు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిలో ఒకటి ప్రతి గురువారం, మరో రెండు రైళ్లు ప్రతి ఆదివారం ఉంటాయని తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు. ఈ మూడు రైళ్లు కడప, కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

మంగళూరు(కర్ణాటక) నుంచి కాచిగూడకు వెళ్లే రైలు(17605) గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఇదే రైలు ఆదివారం కూడా మధ్యాహ్నం 1:30కి రేణిగుంట నుంచి బయల్దేరి కాచిగూడకు చేరుతుంది. ఇక చెన్నై-నాగర్‌సోల్ మధ్య నడిచే రైలు (16003) ఆదివారం ఉదయం 11:40 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరి కాచిగూడ స్టేషన్ మీదుగా షిరిడీ వెళ్తుంది. చెన్నై-నాగర్ సోల్ రైలును ద.మ.రైల్వే అధికారులు ఆదివారం ప్రారంభించారు.

  • Loading...

More Telugu News