: పార్టీ మారే ఆలోచన లేదు: ఎర్రబెల్లి


పార్టీ మారే ఆలోచన లేదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పేద వర్గాల పార్టీ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండగా నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొందని, గత పదేళ్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీలతో ఇబ్బందుల పాలైందని అన్నారు. గత కొన్నేళ్లుగా జరుపుతున్న పోరాటంలో ఎందరో నేతలను, కార్యకర్తలను టీడీపీ కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో దోపిడీదారులు రాజ్యమేలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News