: వరుసగా వికెట్లు కోల్పోతున్న ఆసీస్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ తడబడుతోంది. ఈ రోజు ఉదయం 272 పరుగులకు భారత్ ను ఆలౌట్ చేసి ఆసీస్ బ్యాటింగ్ కు దిగగా.. ఇద్దరు ఓపెనర్లు వార్నర్, మాక్స్ వెల్ ను జడేజా ఇంటిబాట పట్టించాడు. తర్వాత అశ్విన్ బౌలింగ్ లో హ్యూగెస్ ఎల్బీ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు మూడు వికెట్లకు 50 పరుగుల వద్ద ఉంది. కోవాన్ 23 పరుగులతో, షేన్ వాట్సన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.