: 11న హైదరాబాదులో బీజేపీ బహిరంగ సభ: కిషన్ రెడ్డి
ఈ నెల 11న హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హాజరవుతారని చెప్పారు. అంతకంటే ముందు ఈ నెల 6న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ అభివృద్ధిపై ఉద్యమకారులతో చర్చ చేపడుతున్నట్లు వివరించారు.