: గిరిజనులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెస్తా: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికంటే లాభపడేది గిరిజనులేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, గిరిజనులందర్నీ ఉద్యోగులను చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని మూరుమూల గ్రామల్లో ఉన్న గిరిజనులు వర్షాకాలంలో రోగాల బారిన పడుతున్నారని, వారిని వర్షాకాలంలో కొండలు, గుట్టల్లోంచి తరలించడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. 108 పెడితేనే సంతోషపడిపోయిన గిరిజనుల్ని హెలికాప్టర్ లో తరలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని జిల్లాల్లో చెప్పండి అని కార్యకర్తలకు హితబోధ చేశారు. టీఆర్ఎస్ గురించి ప్రచారం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News