: వరంగల్ జిల్లా పచ్చదనంతో కనువిందు చేసేలా చేస్తా: కేసీఆర్


వరంగల్ జిల్లాను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యవతి రాథోడ్, నగేష్ లు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ జిల్లాకు కృష్ణా, గోదావరి నదుల జలాల్లో వాటా ఉందని అన్నారు. ఆ నీటిని వరంగల్ జిల్లా సాగు అవసరాలకు సరఫరా చేసి పచ్చదనంతో కనువిందు చేసేలా చేస్తానని కేసీఆర్ అన్నారు. తెలంగాణను సువర్ణ రాష్ట్రంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రా పాలకులు మోసం చేయడం వల్ల వరంగల్ జిల్లా సస్యశ్యామలం కాలేకపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News