: రాంగోపాల్ వర్మకు మీడియాపై కోపం వచ్చింది!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మీడియాపై కోపం వచ్చింది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తరచుగా వార్తల్లోకెక్కే వర్మ తన ఆవేశాన్ని ట్విట్టర్ లో బయటపెట్టాడు. ఇటీవల కాలంలో 12 నెలల్లో 12 సినిమాలను విడుదల చేసేందుకు వర్మ సిద్ధమవుతున్నారంటూ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని, ఈ విషయాన్ని తాను ఎక్కడా, ఎవరికీ చెప్పలేదని ఆయన ట్వీట్ చేశాడు.‘‘12 నెలల్లో 12 సినిమాలు చేస్తున్నానంటూ వచ్చిన రిపోర్టులు కంప్లీట్ నాన్సెన్స్’’ అని వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. జర్నలిస్టులు వాస్తవాలు తెలుసుకుని రాయాలని, అనుమానముంటే తనను అడిగి రిపోర్ట్ రాయాలని మీడియాపై మండిపడ్డాడు.