: దేశానికి కరదీపిక మోడీ: వెంకయ్యనాయుడు


దేశానికి కరదీపిక మోడీ అని బీజేపీ సీనియన్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. 'మోడీ ఫర్ పీఎం' పేరుతో కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను మోడీ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలరని అన్నారు. గుజరాత్ లో కరెంటు పోదని... ఆంధ్రప్రదేశ్ లో కరెంటు రాదని విమర్శించారు. గుజరాత్ లో భూసార పరీక్ష కార్డులిచ్చారని... ఇక్కడ కనీసం ఆరోగ్య కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల సభలకు డబ్బులిచ్చి జనాలను రప్పిస్తుంటే... మోడీ సభలకు మాత్రం జనాలే వచ్చి డబ్బులిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News