: కాంగ్రెస్ పరిస్థితిని తన పెళ్లినాటి ఘటనతో పోల్చిన వెంకయ్యనాయుడు
కాకినాడలో జరుగుతున్న మోడీ ఫర్ పీఎం సభలో వెంకయ్యనాయుడు తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రసంగం మధ్యలో తన పెళ్లి రోజు జరిగిన ఘటనను వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంట్లోకి వెళ్లేటప్పుడు తమను ద్వారం వద్దే ఆపేశారని... పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు, పెళ్లి కూతురు పేరు పెళ్లికొడుకు చెప్పాలని అడిగారని... తాను వెంటనే తన శ్రీమతి పేరు చెప్పేశానని, కానీ తన భార్య మాత్రం తల వంచుకునే ఉందని... తొందరగా చెప్పమని తాను అడిగానని... హిందూ స్త్రీ తన భర్త పేరును చెప్పరాదన్నదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను చూస్తుంటే తనకు ఆ ఘటన గుర్తుకు వస్తోందని అన్నారు. మీ నాయకుడు ఎవరని ఏ కాంగ్రెస్ నేతను అడిగినా... పేరు చెప్పకుండా... ఊ... ఆ... అంటూ గొణుగుతారని ఎద్దేవా చేశారు.