: సీమాంధ్రలో 13 ప్రభుత్వ సంస్థల ఏర్పాటు: జేడీ శీలం


రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి నష్టం లేదని, ఆంధ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఈరోజు (సోమవారం) గుంటూరులో జేడీ మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ సాధించడంలో తాము విజయం సాధించామని అన్నారు. సీమాంధ్రలో కేంద్రం దశల వారీగా పలు ప్రభుత్వ సంస్థలను నెలకొల్పనుందని, ఇందులో భాగంగానే ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్ఐఐటి, ఓడరేవు వంటి 13 కేంద్రాలను సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించారని ఆయన తెలిపారు. ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్రతిపత్తి వంటివి తమ విజయాలేనని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News