: సీఎం కిరణ్ సంతకాలు చేసిన ఫైళ్లను గవర్నర్ సమీక్షిస్తానన్నారు: వీహెచ్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు చేసిన ఫైళ్లను సమీక్షిస్తానన్నందుకు గవర్నర్ ను కలిసి అభినందనలు తెలిపానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇడుపులపాయలో తెలంగాణకు అనుకూలం అన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్, తరువాత యూటర్న్ తీసుకుని సమైక్యమన్నారని అన్నారు. తెలంగాణలో ప్రాతినిధ్యం లేని జగన్ ఇక్కడ పర్యటిస్తాననడం సరికాదని వీహెచ్ హితవు పలికారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.