: బాలయోగి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: చంద్రబాబు
బాలయోగి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని... ఆయన చేసిన సేవలు పార్టీ ఎన్నటికీ మరిచిపోదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. స్పీకర్ పదవికే బాలయోగి వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.