: ఐదేళ్లలో 50 వేల కోట్ల నిధులిస్తాం: జైరాం రమేష్
సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కింద సీమాంధ్రకు రానున్న ఐదేళ్లలో 50 వేల కోట్ల నిధులు అందుతాయని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. విభజన అనంతరం సీమాంధ్రకు లబ్ది చేకూరేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.