: అకాడమీ అవార్డుల్లో 'గ్రావిటీ' హవా
లాస్ ఏంజెలెస్ లో ఘనంగా జరిగిన 86వ ఆస్కార్ పురస్కారాల్లో 'గ్రావిటీ' చిత్రం సత్తా చాటింది. పది విభాగాల్లో నామినేషన్లకు పోటీ పడిన ఈ సినిమా ఉత్తమ దర్శకత్వం (అల్ఫోన్సో కారొన్), ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ఏడు అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. పలు సంచలన చిత్రాలను రూపొందించిన వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అంతరిక్ష కేంద్రంలో తలెత్తే పలు సమస్యలను ఇద్దరు వ్యోమగాములు ఎలా అధిగమించగలిగారు? అనే అంశాలను దర్శకుడు అల్ఫోన్సో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అనుభూతులతో చూపించారు.
ఇక దర్శకుడు స్టీవ్ మెక్ క్వీన్ రూపొందించిన '12 ఇయర్స్ ఎ స్లేవ్' ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయనటి (లుపిటా యాంగో), ఉత్తమ అడాప్టెట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో మూడు అకాడమీ అవార్డులు సొంతం చేసుకుంది. అటు దర్శకుడు జీన్ మార్క్ వల్లీ తెరకెక్కించిన 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' మొత్తం ఆరు విభాగాల్లో పోటీపడి.. ఉత్తమ సహాయ నటుడు (జారెడ్ లెటో), ఉత్తమ మేకప్, కేశాలంకరణ చిత్రం విభాగాల్లో రెండు పురస్కారాలు దక్కించుకుంది.