: మంత్రి బాలరాజుకు నిరసన సెగ
మంత్రి బాలరాజుకు విశాఖలో నిరసనల సెగ తగిలింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖపట్టణం తీసుకురావడంపై ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు. దీంతో మంత్రి బాలరాజు, విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సమైక్యద్రోహి జైరాం రమేష్ ను ఎందుకు వైజాగ్ తీసుకు వచ్చారని ప్రశ్నించారు. సమైక్య ద్రోహులు సీమాంధ్రలో అడుగుపెట్టేందుకు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. సమైక్య ద్రోహులు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.