: ఢిల్లీలో హోటళ్లు ప్రపంచంలోనే దారుణమట


భారత దేశ రాజధానిలో హోటళ్లు ప్రపంచంలోనే పరమ చెత్తట. ట్రివగో అనే హోటల్ సెర్చింగ్ వెబ్ సైట్ ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాల్లోని హోటళ్ల వివరాల ఆధారంగా జాబితా రూపొందించగా.. అందులో ఢిల్లీ 90వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో ముంబైలోని హోటళ్లు చాలా నయం. ముంబై 65వ స్థానంలో ఉంది. 200 హోటల్ బుకింగ్ సైట్లలోని 8.2 కోట్ల అభిప్రాయాలను క్రోడీకరించి ట్రివగో ఈ జాబితాను రూపొందించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్(94), థాయ్ లాండ్ లోని పట్టాయ(95), ఫిలిప్పీన్స్ లోని మనీలా(100).. హోటళ్ల విషయంలో ఢిల్లీ కంటే మరింత దారుణ స్థితిలో ఉన్నాయి. ఇటలీలోని సొర్రెంటో మంచి హోటళ్ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది. ఆసియా నుంచి ఒక్క నగరం కూడా టాప్ 10లో లేకపోవడం గమనార్హం. శుభ్రత, సిబ్బంది సేవలు ఇతర అంశాల ఆధారంగా ఈ నగరాలకు స్థానాలను కేటాయించారు.

  • Loading...

More Telugu News