: కేన్సర్ చికిత్సలో కీమోథెరపీ మున్ముందు సేఫ్!


కేన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీతో రోగులు ఇప్పటి వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స తరువాత కేన్సర్ తగ్గుముఖం పడుతున్నా, వేడి భరించలేకపోవడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనల్లో పురోగతి కనిపించింది. కీమోథెరపీని సురక్షితంగా నిర్వహించే వినూత్న పద్ధతిని పరిశోధకులు కనిపెట్టారు. కాంతి ఉత్తేజిత ఔషధ చేరవేతగా పిలిచే ఈ పద్ధతిని లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందించిన నానో పార్టికల్స్ లో అతి సూక్ష్మ రంధ్రాలు లేదా నాళికల్లో మందుని నింపి కేన్సర్ కణితి వద్దకు చేరుస్తారు. అవి కణితిలోకి ప్రవేశించే సమయంలో రెండు ప్రోటాన్ అణువులతో కూడిన లేజర్ కాంతికిరణాలతో వాటిని ఢీకొట్టిస్తారు. దీంతో అణువులు సరిగ్గా కేన్సర్ కణం లోపల మందుని విడుదల చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యవంతమైన కణాలకు ఎలాంటి హాని ఉండదు. దీంతో, కీమోథెరపీ దుష్ప్రభావాలను నిరోధించవచ్చని పరిశోధనల్లో తేలింది.

  • Loading...

More Telugu News