: జమ్మూకాశ్మీర్ ప్రజలు గజదొంగలు: కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా
కేంద్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నోరు జారారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను అవమానించేలా మాట్లాడారు. వారిని గజదొంగలని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ రంగ దుస్థితిపై అబ్దుల్లా ఢిల్లీలో మాట్లాడుతూ.. 'కాశ్మీరీ ప్రజలు దొంగలు కారు. గజదొంగలు. దళారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా విద్యుత్ ను పొందుతున్నారు' అంటూ మండిపడ్డారు. పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పనితీరు బాలేదన్నారు. అబ్దుల్లా వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్లోని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాల సభ్యులు రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు డిమాండ్ చేశారు.