: మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి విజయం ఖాయం: యనమల
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. యథావిధిగా టీడీపీ ప్రజాగర్జన జరుగుతుందని చెప్పారు. అయితే, ప్రజాగర్జన తేదీల్లోనే మార్పులు ఉంటాయని విజయవాడలో తెలిపారు. స్థానిక నేతల మనోభావాల మేరకే ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకుంటామని పేర్కొన్నారు.