: జైరాం విశాఖ పర్యటన.. అడ్డుకునేందుకు సిద్ధమైన టీడీపీ
కాసేపట్లో కేంద్ర మంత్రి జైరాం రమేష్ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నాయి. దీంతో విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సందర్శకుల టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవించకుండా, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వారిలో ఒకరైన జైరాం రమేష్ కు సీమాంద్ర గడ్డపై అడుగుపెట్టే హక్కు లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.