: పెట్రోలు బంకుల్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించండి: హెచ్ఆర్సీలో ఫిర్యాదు
సమ్మెకు దిగిన జంటనగరాల పెట్రోలు బంకులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది. గత రాత్రి నుంచి పెట్రోలు బంకులు మూసివేసి అత్యవసర సేవలకు విఘాతం కల్గిస్తున్న పెట్రోలు బంకుల యజమానులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సేవలను పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.