: ఆర్జేడీతో పొత్తుకు రాహుల్ విముఖత.. జేడీయూపై కన్ను!
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆర్జేడీతో పొత్తుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీహార్ లో కాంగ్రెస్ కు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పదకొండు లోక్ సభ సీట్లు ఆఫర్ చేశారు. అయితే, బీహార్ లో ఆర్జేడీతో కాకుండా జేడీయూతో పొత్తు పెట్టుకోవాలని, లాలూ కన్నా నితీష్ కుమారే బెటర్ అని రాహుల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.