: చక్కెర బ్యాటరీ... ఛార్జింగ్ చేస్తే పది రోజులు వాడుకోవచ్చు!


చక్కెర తిన్న వెంటనే శరీరానికి అవసరమైన శక్తిగా మారుతుంది. ఈ సూత్రాన్ని బ్యాటరీలో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకి ప్రాణం పోశారు వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. దీంతో పరిశోధనలు చేసి సరికొత్త బ్యాటరీని రూపొందించారు. శరీరంలో చక్కెర జీవక్రియ ద్వారా శక్తిగా మారుతుంది, అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ నీరుగా మారి ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది.

ఈ బయో బ్యాటరీ కూడా ఇదే పద్ధతిలో పనిచేసి శక్తిని విడుదల చేస్తుందని, ఇది ఫోన్లలో వినియోగించే సాధారణ లిథియం బ్యాటరీల కంటే తేలికగా ఉంటుందని, మరింత శక్తిమంతంగా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. లిథియం బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఒక రోజు సెల్ పనిచేస్తుందని, అదే చక్కెర బ్యాటరీ అయితే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే పది రోజులపాటు సెల్ కు ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదని చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సెల్ వినియోగదారులకు పండగే.

వీటిల్లో ఇంకో సౌలభ్యం కూడా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. లిథియం బ్యాటరీ నేలలో కలిసిపోయేందుకు సుదీర్ఘసమయం తీసుకుంటుందని, చక్కెర బ్యాటరీ తొందరగా మట్టిలో కలిసిపోతుందని దీనివల్ల హాని కూడా పెద్దగా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News