: కర్నూలును రాజధానిని చేయకపోతే మరో ఉద్యమం: కోట్ల
కర్నూలును రాజధానిని చేయకపోతే మరో ఉద్యమం చేస్తామని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, గతంలో రాజధానిగా ఉన్న కర్నూలునే రాజధాని చేయాలని మరో పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే ఉద్యమిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన వారు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఆదరించరని కోట్ల అభిప్రాయపడ్డారు.