: పసిపాపను భవనంపై నుంచి పడేశారు
తల్లి గర్భం నుంచి బయటకొచ్చి రోజులైనా కాలేదు, లేలేత పసికందును కిరాతకంగా చంపేశారు. ఆస్పత్రి భవనంపై నుంచి కిందపడేయంతో పసిపాప కన్నుమూసింది. ఈ దారుణం అనంతపురం జిల్లా గుంతకల్లులోని స్వప్న నర్సింగ్ హోంలో జరిగింది. ఆడబిడ్డ పుట్టినందువల్ల తల్లిదండ్రులే ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారని ఆస్పత్రి వర్గాలు అంటుంటే.. నర్సు ఆస్పత్రి పై నుంచి తమ బిడ్డను కింద పడేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయినా, ఆస్పత్రి సిబ్బంది బిడ్డను కాపాడడానికే ప్రయత్నిస్తారు గానీ, ప్రాణం తీయరు కదా?