: మ్యూజిక్ ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ అంటే ఎక్కువమందికి ప్రీతి. చివరి బొట్టు వరకూ ఆస్వాదిస్తూ లాగిస్తుంటారు. అంత రుచికరమైన హిమ క్రీమ్ ను మనసుకు నచ్చిన సంగీతం వింటూ తింటుంటే ఆ మజా పూర్తి స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత ప్రియుల కోసం అలాంటి ఒక మ్యూజిక్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. న్యూయార్క్ శాస్త్రవేత్తలు సంగీతాన్ని వినిపించే ఐస్ క్రీమ్ కోన్లు తయారు చేశారు. వీటిలో సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఐస్ క్రీమ్ అలా నాలుకతో తాకగానే సెన్సర్లు స్పందించి.. కింది భాగంలో ఉన్న బోర్డుకు సంకేతాలు పంపుతాయి. దాంతో సంగీతం వినిపించడం మొదలవుతుంది.