: భారత్ 272 పరుగులకు ఆలౌట్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 272 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ పై కేవలం పది పరుగుల ఆధిక్యాన్నే సంపాదించగలిగింది. ఎన్ఎమ్ లియాన్ 7వికెట్లు తీసుకుని, భారత ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే ముగించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 262 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్ట్ కూడా ఫలితం దిశగా నడుస్తోంది.
 
భారత జట్టులో మురళి విజయ్ చేసిన 57 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆ తర్వాత పుజారా చేసిన అర్ధశతకం వల్లే భారత్ ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. 

  • Loading...

More Telugu News