: నేటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభంకానున్నాయి. పదకొండు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ ఉదయం స్వస్తివాచకంతో మొదలవుతాయి. ఈ రోజు రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు. ఇక రెండో రోజు ధ్వజారోహణం జరుగుతుందని, మూడో రోజు నుంచి అలంకార వేడుకలకు శ్రీకారం జరుగుతుందని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. విశేష పర్వాల్లో మార్చి 9న ఎదుర్కోలు ఘట్టాన్ని, 10వ తేదీ రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, 11వ తేదీన రధోత్సవం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మార్చి 13న జరిగే శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.