: ఐదు వేల క్యారెట్ల 'పచ్చ' వెలుగులు
నవరత్నాలలో దేని ప్రత్యేకత దానిదే. దేవి విలువ దానిదే. క్యారెట్లను బట్టి ఆయా రాళ్ళ విలువ మరింత పెరుగుతుంది. అలాగే, ఏకంగా ఐదు వేల క్యారెట్ల పచ్చరాయి ఒకటి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలోని ఉరల్స్ ప్రాంతంలో ఈ విలువైన పచ్చ తాజాగా వెలుగు చూసింది. ఉరల్స్ ప్రాంతం పచ్చరాళ్ళకు ప్రసిద్ధి. ఇక్కడ లభ్యమయ్యే రాళ్ళు అద్భుతమైన నాణ్యతతో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఇప్పుడు దొరికిన ఈ 5 వేల క్యారెట్ల పచ్చ కూడా అద్భుతంగా మెరిసిపోతోందని చెబుతున్నారు. ఒక కిలో బరువు తూగుతున్న ఈ పచ్చ విలువను ఇంకా నిర్ధారించాల్సి వుంది! .