: టీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది: కేసీఆర్
భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై పార్టీ తరపున సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు నిన్న రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం సరికాదంటే, ఇప్పుడు ఏకంగా ఏడు మండలాలను కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేస్తామనడం అన్యాయానికి పరాకాష్ఠని తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసి, తాను ఢిల్లీలో ఉండగానే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలసి హెచ్చరించినా వారు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన సిరా తడి ఆరకముందే తెలంగాణకు అన్యాయం జరిగేలా చేసిన ఈ నిర్ణయం బాధాకరమని, ఈ విషయంలో న్యాయం జరిగేవరకు పోరాడతామని తెలిపారు.