: స్టార్ గోల్డ్ లో తాజా బాలీవుడ్ చిత్రాల హంగామా
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 18 బాలీవుడ్ చిత్రాల ప్రసార హక్కులను స్టార్ గోల్డ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం సుమారు 350కోట్ల రూపాలు ఖర్చు చేసిందని సమాచారం. ఇటీవల విడుదలైన జైహో, కిక్, త్వరలో రానున్న బాంబేవెల్వెట్, రాయ్, బంగ్ బంగ్, యాక్షన్ జాక్సన్, సింగమ్ 2, హమ్ షకల్స్, బాబీ జసూప్ తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే, క్రియేచర్, గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్, ట్రాఫిక్, సోనాలీ కేబుల్, ఓ తేరీ, భాగ్ జానీ, హవా హవాయి, యారియా సినిమాలను 2014 సంవత్సరంలో స్టార్ గోల్డ్ ప్రసారం చేయనుంది.