: ఇండియాపై పాక్ విజయం
చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో ఈ రోజు జరిగిన ఆసియాకప్ వండే మ్యాచ్ లో పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో భారత్ ను ఓడించింది. 246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కుర్రాళ్ళు 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. పాకిస్తాన్ బ్యాట్స్ మన్ షాహిద్ అఫ్రిది 18 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మన జట్టులో రోహిత్ శర్మ 56, అంబటి రాయుడు 58, జడేజా 52 పరుగులు చేశారు.