: 'చిరంజీవితో మనస్పర్థల' వార్తలపై పవన్ కల్యాణ్ ప్రకటన!


చిరంజీవికీ, పవన్ కల్యాణ్ కూ మధ్య ఎటువంటి మనస్పర్థలూ లేవని పవన్ కల్యాణ్ కార్యాలయం ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ సాయంకాలం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో పవన్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తల పట్ల కూడా స్పందించారు. రాజకీయాల పట్ల ఆయన అభిప్రాయం కానీ, 'పార్టీ' గురించి కానీ, ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి కానీ, ఈ నెల రెండో వారంలో పవన్ స్వయంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ 'గబ్బర్ సింగ్ 2' సినిమాతో బాటు, 'ఓ మై గాడ్' రీమేక్ పనులలో కూడా బిజీగా వున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News