: కిరణ్, లగడపాటిలను అరెస్ట్ చేయాలి: వివేక్
ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్, మాజీ ఎంపీ లగడపాటిలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కలలుగన్న తెలంగాణను నిర్మించుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.