: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ
పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు సత్తా చాటాడు. 55 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఒకవైపు భారత వికెట్లు క్రమం తప్పకుండా పడిపోతున్న సమయంలో అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం భారత్ 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రాయుడు (56), జడేజా (14) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రహానే 23, దినేష్ కార్తీక్ 23 పరుగులకు ఔటయ్యారు.