: విద్యుత్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి: బాలకృష్ణ


కాంగ్రెస్ పాలనలో విద్యుత్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు. విద్యుత్ కొరత కారణంగా ప్రస్తుతం రాష్ట్రం చీకటిలో మునిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. బాలయ్య నేడు విశాఖ జిల్లా పాయకారావు పేట నియోజకవర్గంలో నాలుగు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకమని, టీడీపీని గెలిపించుకోలేకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోవడం ఖాయమని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్నిచాటితే, బాబు.. తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా నిలిచారని ఆయన అభివర్ణించారు. 

  • Loading...

More Telugu News