: ఎస్పీ ఏడాది పాలనలో 150 మతకలహాలు: మోడీ
ఎస్పీ అంటే సమాజ్ వాదీ పార్టీ కాదని, సమాజ్ విరోధి పార్టీ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ ఏడాది పాలనలో దాదాపు 150 మతకలహాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. లక్నోలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.