: మాటకు కట్టుబడే రాజకీయాల నుంచి వైదొలిగాను: లగడపాటి
తానెప్పుడూ కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని... విభజన విషయంలో మాత్రమే పార్టీ తీరును వ్యతిరేకించానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తాను కుల, మత, ప్రాంత రాజకీయాలకు దూరమని చెప్పారు. ఇచ్చిన మాట మేరకే తాను రాజకీయాల నుంచి వైదొలిగానని... ఈ విషయాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ రోజు ఆయన విజయవాడలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తాను రాజకీయాలకు దూరమైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.