: ఇక్కడకు వచ్చినప్పుడల్లా వాజ్ పేయి గుర్తొస్తారు: మోడీ
దేశాభివృద్ధి ఉత్తరప్రదేశ్ పై ఆధారపడి ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. యూపీ కష్టసుఖాల్లో తాము పాలుపంచుకుంటామని చెప్పారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నిర్వహించిన విజయ్ శంఖ్ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట నష్టపోయిన రైతులను తాము ఆదుకుంటామని... రైతు నష్టపోతే జాతి మొత్తం నష్టపోతుందని చెప్పారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా తనకు వాజ్ పేయి గుర్తొస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.