: వైఎస్ 'ఆత్మ' కూడా జైలుకెళ్ళడం ఖాయమంటున్న బాబు
అవినీతికి పాల్పడి రాష్ట్రాన్నే దోచుకున్న వైఎస్ కానరాని లోకాలకు వెళితే, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు త్వరలోనే జైలుకు వెళ్ళనున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని సీబీఐ సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో బాబు పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. బాబు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి దోపిడీ వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు.