: వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తుపై వారంలో నిర్ణయం: తమ్మినేని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశాన్ని సీపీఎం పరిశీలిస్తోంది. దీనిపై ఈ రోజు ఢిల్లీలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్లు ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. వారంలో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీగానే వైఎస్సార్ కాంగ్రెస్ ను చూస్తున్నట్లు చెప్పారు.