: నెల్లూరులో 5న టీడీపీ ప్రజాగర్జన.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక
టీడీపీ ప్రజాగర్జన సభ ఈ నెల 5న నెల్లూరు నగరంలో జరగనుంది. దీనిలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరనున్నారు.