: ఏళ్ల తరబడి ఎవరైనా ఓదార్పు యాత్రలు చేస్తారా?: వీహెచ్
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలన్నీ డ్రామాలేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎవరైనా ఓదార్పు యాత్రాలు చేస్తారా? అని వీహెచ్ నిలదీశారు. సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేందుకే జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను మార్చి ముంపు బాధితుల సంఖ్యను తగ్గించాలని కోరారు.