: వైఎస్సార్ కాంగ్రెస్ హ్యాండిచ్చింది: ఆదాల


కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరికే చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ఆదాల వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టీడీపీలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్ఠానాన్ని ధిక్కరించి ఆదాల రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించడంతో.. ఆదాల చివర్లో పోటీ నుంచి విరమించుకున్నారు.

  • Loading...

More Telugu News