: 100% మార్కులు రాలేదని.. సూదులతో శిక్షించుకున్నాడు


పరీక్షల్లో 99 శాతం మార్కులు సాధించాడు. అయినా ఆ ఒక్క శాతం మార్కులు కోల్పోయినందుకు మధనపడ్డాడు. కేవలం ఒకే ఒక్క శాతం మార్కులు పోగొట్టుకున్నందుకు కుట్టు సూదులతో తనకు తాను శిక్ష విధించుకున్నాడు తొమ్మిదేళ్ల చైనా విద్యార్థి. నాలుగు సూదులను పూర్తిగా పొట్టలోకి గుచ్చుకున్నాడు. హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లో ఇది జరిగింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న అతన్ని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఆ సూదులను తొలగించారు. వంద శాతం మార్కులు సాధించలేకపోయినందుకే అలా శిక్షించుకున్నానని అతడు చెప్పాడు. ప్రపంచంలోనే చైనా విద్యార్థులపై అత్యంత ఒత్తిడి ఉంటున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News