: పార్కులో వాకింగ్.. ఇద్దరు గన్ మెన్లు.. మారిన కిరణ్ స్టైల్
మొన్నటి దాకా ముఖ్యమంత్రి హోదాలో హై సెక్యూరిటీ మధ్య బిజీబిజీగా గడిపిన కిరణ్ కుమార్ రెడ్డి... మాజీ అవగానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ రోజు హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తూ కిరణ్ మీడియా కంట పడ్డారు. వాకింగ్ పూర్తయిన వెంటనే పాత మిత్రులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సింపుల్ గా ఫార్చూనర్ కారులో వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావడంతో ఆయన సెక్యూరిటీ కూడా తగ్గిపోయింది. కిరణ్ వెంట ఇద్దరు గన్ మెన్లు మాత్రమే ఉన్నారు.