: మోడీపై పొన్నం విమర్శనాస్త్రాలు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రవిభజనపై మోడీ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. మోడీ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని అన్నారు. మోడీకి చంద్రగ్రహణం పట్టిందని (మోడీ, చంద్రబాబుల స్నేహాన్ని ఉద్దేశించి) ఎద్దేవా చేశారు. ఈ రోజు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.